schedule Saturday, September 05, 2026

సీఎం సహాయ నిధి.. పేదల పెన్నిధి... ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి

calendar_today April 24, 2026
person Prajagalam News
సీఎం సహాయ నిధి.. పేదల పెన్నిధి... ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి
(తాండూర్) సీఎం సహాయనిది పేదలకు పెన్నిధి లాంటిదని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రులలో చికిత్స పొందిన తాండూరు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలకు చెందిన 175 మంది లబ్ధిదారులకు దాదాపు రూ. 65,00,000/- (అరవై ఐదు లక్షల) విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్  చెక్కులను ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో స్థానిక నాయకులతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.