schedule Thursday, May 21, 2026

2వ రోజు ఆమరణ నిరాహారదీక్ష దీక్షకు మద్దతు

calendar_today May 10, 2026
person Prajagalam News
2వ రోజు ఆమరణ నిరాహారదీక్ష దీక్షకు మద్దతు
  వీహెచ్ 2వ రోజు ఆమరణ నిరాహారదీక్ష దీక్షకు మద్దతుగా తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ర్యాలీ,తెలంగాణ ప్రభుత్వ సలహాదారులు,మాజీ మంత్రి, మాజీ పీసీసీ అధ్యక్షులు,మాజీ రాజ్యసభ సభ్యులు, వి.హనుమంతారావు దేశ వ్యాప్తంగా జరిగే జనాభా లెక్కల్లో కులగణన చేస్తామని బీజేపీ కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ఎస్సీ,ఎస్టీ కలామ్ పెట్టి, ఓబీసీ కలామ్ పెట్టకపోవడాన్ని బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఓబీసీలపట్ల వ్యవరించే తీరు బాధాకరమని ఆయన ఆమరణ నిరాహారదీక్ష కు దిగారు,నరేంద్రమోదీ ప్రధానమంత్రి దేశంలో బీసీ పరిస్థితి అద్వాన్నంగా తయారయింది అని పేర్కొన్నారు.తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు మేకపోతుల నరేందర్ గౌడ్ వీహెచ్ దీక్షకు మద్దతు తెలుపుతూ బీజేపీ పార్టీ, బీజేపీ ప్రభుత్వ బీసీ వ్యతిరేక విధానాలను తూర్పురాబట్టారు.బీసీలు అన్యాయానికి గురైయ్యారని వాపోయ్యారు.ఈ కార్యక్రమంలో బషీరాబాద్ మండల వర్కింగ్ ప్రసిడెంట్ లక్ష్మన్ రావు,కలాల్ నర్సిములు గౌడ్,బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి, తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు, నాయకులు,తదితరులు పాల్గొన్నారు.