కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కార్యాలయ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించిన పిఎసిఎస్ చైర్మన్, ఏఎంసి చైర్మన్
July 7, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయ నిర్మాణానికి సంబంధించిన స్థలాన్ని గురువారం పిఎసిఎస్ చైర్మన్ బోలుసాని భీంరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్ ఆంజనేయులు ముదిరాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... ఎమ్మెల్యే డాక్టర్ టి. రామోహన్ రెడ్డి ప్రత్యేక చొరవతో రూ.50 లక్షల వ్యయంతో వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం మంజూరైందని ఈ సందర్భంగా తెలిపారు. ఈనెల 10న ఎమ్మెల్యే డాక్టర్ టి. రామోహన్ రెడ్డి చేతుల మీదుగా మార్కెట్ కమిటీ కార్యాలయ భవన నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి రైతులు, ప్రజాప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.స్థల పరిశీలన కార్యక్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ భరత్ కుమార్ రెడ్డి, సర్పంచులు బి. వెంకటయ్య, తిరుపతయ్య, కామన్‌పల్లి వెంకటయ్య, పిరంపల్లి నక్క నరసింహులు, కాంట్రాక్టర్ లక్ష్మయ్యతో పాటు మార్కెట్ కమిటీ సిబ్బంది పాల్గొన్నారు.