హిందూ ఉత్సవ కమిటీ నూతన కార్యవర్గానికి బిఎస్ఆర్ శుభాకాంక్షలు
September 1, 2026
Prajagalam News
(తాండూరు)
హిందూ ఉత్సవ కమిటీ నూతన కార్యవర్గానికి సీనియర్ కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. హిందూ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శిగా బీర్కెట్ రఘు, కోశాధికారిగా కౌన్సిలర్ కిరణ్ కుమార్ ఎన్నికైన సందర్భంగా వారిని బుయ్యని శ్రీనివాస్ రెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులు కమిటీ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ హిందూ పండుగలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో, క్రమశిక్షణతో నిర్వహించాలని ఆకాంక్షించారు. తాండూరు ప్రాంతంలో పండుగల సందర్భంగా ప్రజలందరినీ సమన్వయం చేసుకుంటూ శాంతియుత వాతావరణంలో ఉత్సవాలను నిర్వహించేందుకు కృషి చేయాలని సూచించారు.హిందూ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాలు భక్తిభావంతో పాటు సమాజంలో ఐక్యత, సోదరభావం, సేవా స్ఫూర్తిని పెంపొందించేలా ఉండాలని పేర్కొన్నారు. నూతన కార్యవర్గం ప్రజల సహకారంతో మరింత సమర్థవంతంగా పనిచేసి కమిటీకి మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.ఈ సందర్భంగా బీర్కెట్ రఘు, కిరణ్ కుమార్లు బిఎస్ఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. తమపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తూ కమిటీ అభివృద్ధికి, ఉత్సవాల విజయవంతానికి కృషి చేస్తామని తెలిపారు.