schedule Wednesday, September 02, 2026

మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు!

calendar_today September 2, 2026
person Prajagalam News
మాట ఇచ్చారు.. నిలబెట్టుకున్నారు!
   

• ఎన్నికల హామీని నెరవేర్చిన కౌన్సిలర్ ఇర్షాద్

• వార్డు నం.7 లో నాలుగు ప్రాంతాలకు పేర్ల ప్రతిపాదన.. కౌన్సిల్‌లో తీర్మానం

  (తాండూర్)   ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వార్డు నంబర్‌ 7 మున్సిపల్‌ కౌన్సిలర్‌ షేక్‌ ఇర్షాద్‌ అహ్మద్‌ మరో అడుగు ముందుకేశారు. వార్డులోని నాలుగు ప్రాంతాలకు ప్రత్యేక పేర్లు ఏర్పాటు చేస్తానని ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు, తాండూర్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ సమావేశంలో ఆయా పేర్లను ప్రతిపాదిస్తూ తీర్మానం చేయించారు.వార్డు అభివృద్ధితో పాటు ప్రజల స్థానిక గుర్తింపు, ప్రాంతాల ప్రత్యేకతకు ప్రాధాన్యం కల్పించాలనే ఉద్దేశంతో కౌన్సిలర్‌ ఇర్షాద్‌ ఈ అంశాన్ని కౌన్సిల్‌ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇచ్చిన హామీని కేవలం మాటలకే పరిమితం చేయకుండా అధికారికంగా తీర్మానం చేయించడం పట్ల వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. హుస్సేన్ నగర్, కోకిల కాటేజ్,సుప్రీం కాలనీ, విలేమూన్ చౌరస్తా కౌన్సిల్ తీర్మానం లభించింది.ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నామని కౌన్సిలర్‌ షేక్‌ ఇర్షాద్‌ అహ్మద్‌ తెలిపారు. “ప్రజలకు ఇచ్చిన మాటే నాకు ముఖ్యం. హామీ ఇచ్చిన ప్రతి అంశాన్ని దశలవారీగా నెరవేర్చడమే నా లక్ష్యం. ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే నా బాధ్యత” అని  పేర్కొన్నారు.ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని కౌన్సిల్‌ తీర్మానం వరకు తీసుకెళ్లడంతో కౌన్సిలర్‌ ఇర్షాద్‌ పనితీరుపై వార్డు ప్రజల్లో సానుకూల స్పందన వ్యక్తమవుతోంది.