schedule Wednesday, September 02, 2026

రాహుల్ గాంధీ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను ఎత్తివేయాలి

calendar_today September 1, 2026
person Prajagalam News
రాహుల్ గాంధీ పై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను ఎత్తివేయాలి
  ⇒బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి డీసీసీ ప్రెసిడెంట్ జాదవ్ ధారసింగ్ నాయక్  
  • Vikarabad :- లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై దురుద్దేశపూర్వకంగా బిజెపి ప్రభుత్వం కుట్రతో నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ను వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షులు జాదవ్ ధారసింగ్ నాయక్ డిమాండ్ చేశారు.వికారాబాద్ జిల్లా డీసీసీ ఆధ్వర్యంలో ఏఐసీసీ,పీసీసీ పిలుపు మేరకు లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పై ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ బీజేపీ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మంగళవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు కాంగ్రెస్ పార్టీ నాయకులు ర్యాలీ,నిరసన చేపట్టారు.ఈ సందర్భంగా డీసీసీ ప్రెసిడెంట్ జాదవ్ ధారసింగ్ నాయక్ మాట్లాడుతూ....లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ పై కక్షపూరితంగా ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయడం అప్రజాస్వామిక చర్య అని అన్నారు. అంతేకాకుండా బీజేపీ పార్టీ దేశంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజల పట్ల వివక్ష చూపడం హేయమైన చర్య అని విమర్శించారు. ఉత్తరాఖండ్‌లోని హాల్ద్వానీలో జరిగిన ఘటనకు బాధ్యులైన బీజేపీ కార్యకర్తలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే, బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని ఆయన హెచ్చరించారు.బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన నిరంతరం పోరాడుతుందని జాదవ్ ధారాసింగ్ నాయక్ అన్నారు.ఈ కార్యక్రమంలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి,ఏ ఐ సీసీ సభ్యులు సంతోష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య,కాంగ్రెస్ పార్టీ వికారాబాద్ మండల అధ్యక్షులు బిళ్లపాటి రాజశేఖర్ రెడ్డి,ఏఎంసి చైర్మన్లు శ్రీనివాస్ ముదిరాజ్, వడ్డే శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, సీనియర్ నాయకులు కిషన్ నాయక్, చిగుళ్లపల్లి రమేష్, మహిపాల్ రెడ్డి ఉత్తమ్ చంద్, అమీర్ అబ్దుల్లా యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు సతీష్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సంతోష, మైనారిటీ సెల్ చైర్మన్ ఖాజా సలావుద్దీన్ హైమద్, ఎస్సి సెల్ ప్రెసిడెంట్ రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు,ఆయా గ్రామాల సర్పంచులు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.