ముజాహిద్‌పూర్ వ్యవసాయ బావిలో పడి వ్యక్తి మృతి.
July 7, 2026
Prajagalam News
(కుల్కచర్ల, జులై 06)
వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్‌పూర్ గ్రామ పంచాయతీలోని వ్యవసాయ బావిలో మగ వ్యక్తి మృతదేహం లభ్యమైన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సమాచారం అందుకున్న వెంటనే కుల్కచర్ల ఎస్ఐ రమేష్ కుమార్ సిబ్బందితో కలిసి ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. వెంటనే సిబ్బందితో బావిలో నుండి మృతదేహాన్ని బయటకి తీశారు. మృతదేహం చేతికి, కాలికి చేపల వల చిక్కి ఉండటం గమనించారు. మృతుడు కేశంపేట మండలం ఇప్పలపల్లి గ్రామానికి చెందిన ఎరుకల యాదయ్య గా(35) గుర్తించారు. ప్రాథమిక పరిశీలన ప్రకారం మృతి జరిగి దాదాపు 4 నుంచి 5 రోజులు అయి ఉండవచ్చని భావిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.