schedule Wednesday, September 02, 2026

ఈ నెల 10న తాండూరులో విద్యాసంస్థల బంద్

calendar_today July 8, 2026
person Prajagalam News
ఈ నెల 10న తాండూరులో విద్యాసంస్థల బంద్
   

• వామపక్ష విద్యార్థి సంఘాల రాష్ట్రవ్యాప్త బంద్‌కు బీసీ సంఘం సంపూర్ణ మద్దతు

• విద్యార్థుల డిమాండ్లను వెంటనే నెరవేర్చాలి

• జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్

(తాండూర్ ) విద్యార్థుల హక్కుల పరిరక్షణ, ప్రభుత్వ విద్యా వ్యవస్థ బలోపేతం, పెండింగ్‌లో ఉన్న విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం వామపక్ష పార్టీలు, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ, ఏఐఎస్‌ఎఫ్ తదితర విద్యార్థి సంఘాలు ఈ నెల 10వ తేదీన నిర్వహిస్తున్న రాష్ట్రవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు బీసీ సంఘం సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ తెలిపారు.తాండూర్‌లో జరిగిన బీసీ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని విద్యార్థులు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, స్కాలర్‌షిప్‌ల ఆలస్యం, ప్రభుత్వ విద్యాసంస్థల్లో మౌలిక వసతుల కొరత, ఖాళీ ఉపాధ్యాయ పోస్టులు, పెరుగుతున్న విద్యా ఖర్చులతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని తీవ్రంగా విమర్శించారు.ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన, అందుబాటులో ఉన్న విద్యను అందించేలా ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, కార్పొరేట్ విద్యకు ప్రాధాన్యతనిచ్చే విధానాలను పునఃసమీక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు.ఈ నెల 10న జరిగే విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని, విద్యార్థులు, యువజనులు, ప్రజాసంఘాలు, బీసీ సంఘం నాయకులు, కార్యకర్తలు, ప్రజాస్వామ్యవాదులందరూ పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వానికి గట్టి హెచ్చరిక పంపాలని జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు కందుకూరి రాజ్‌కుమార్ పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకుర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేష్, వడ్డెర సంఘం జిల్లా నాయకులు వడ్డే సత్యనారాయణ, మహిళా నాయకులు అనిత, నరసమ్మ, మంజుల, జగదీశ్వరి, మంబాపూర్ మంజుల, మీడియా ఇన్‌చార్జ్ బసవరాజ్, తాండూర్ అధ్యక్షుడు బసంత్, యువ నాయకులు జోసఫ్, రాము ముదిరాజ్, పరమేష్, టైలర్ రమేష్, గోపాల్, నరసింహ, మంతటి రాజు, సురేష్, యాసర్, వినయ్, కిరణ్, శ్రవణ్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.