(తాండూర్)
సర్ ప్రక్రియ 100% విజయవంతంగా పూర్తి చేయడం గర్వకారణమని తాండూర్ శాసనసభ్యులు బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు.యాలాల్ మండలం అచ్చుతాపూర్ గ్రామంలో బూత్ నంబర్ 187లో SIR కార్యక్రమాన్ని 100 శాతం విజయవంతంగా పూర్తి చేయడం సంతోషకరమని అన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... ఈ విజయం వెనుక అహర్నిశలు శ్రమించిన అధికారులు, అన్ని పార్టీల బీఎల్ఏలకు బీఎల్ఓకు, పార్టీ నాయకులకు, కార్యకర్తలకు మరియు ప్రతి ఓటరికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.మీ అంకితభావం వల్లే ఈ కార్యక్రమం విజయవంతమైందని పేర్కొన్నారు.ప్రజాస్వామ్యానికి ఓటరే మూలస్తంభం. ప్రతి అర్హుడైన వ్యక్తి ఓటరు జాబితాలో ఉండటం, ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగడం మనందరి బాధ్యత అని ఈ బాధ్యతను మన నియోజకవర్గం అత్యంత సమర్థవంతంగా నిర్వర్తించడం గర్వకారణమన్నారు. అనంతరం బీఎల్ఏ సత్యప్ప గౌడ్ కు, బీఎల్ఓ జ్యోశ్న కు శాలువాతో సన్మానించి అభినందించారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శిరీష వెంకటయ్య, సర్ నియోజకవర్గ కన్వీనర్ పురుషోత్తం రావు, ఏఏంసి చైర్మన్ పట్లోళ్ళ నర్సింలు, పార్టీ అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, మధు సుధన్ రెడ్డి, అధికారులు, మండల నాయకులు పాల్గొన్నారు.