• నీట్, జెఈఈ, ఈఎపిసెట్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం
• అభినందించిన శ్రీ చైతన్య పాఠశాల యజమాన్యం
(తాండూర్)
నీట్, జెఈఈ, ఈఎపిసెట్ ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థుల ప్రభంజనం సృష్టించారు. తాండూర్ బ్రాంచ్1 పాఠశాల 2023-2024 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన విద్యార్థులు నీట్ లో యం డి.ఇస్మాయిల్, రాజేష్ పవర్, ఎం. అజయ్, ఈ.అక్షయ, జెఈఈ లో యం.శ్రీకాంత్,ఈఎపిసెట్ లో యం. విజయ్ ఘన విజయం సాధించారు. వీరిని పాఠశాల యాజమాన్యం ఏ జీ ఎం పల్లె వెంకట్ , ఏ సి ఓ వీరయ్యస్వామి అభినందించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మహమ్మద్ జాఫర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలను శ్రద్ధగా విని చదివితే ఎన్నో విజయాలు పొందవచ్చని తెలిపారు. పాఠశాల డీన్ వెంకటేష్ చారి, ప్రతి విజయానికి పునాది వంటి వారు ఉపాధ్యాయులే అని విద్యార్థులను ఉద్దేశించ పేర్కొన్నారు .సి బ్యాచ్ ఇంచార్జ్ ఇర్ఫాన మాట్లాడుతూ జీవితంలో ప్రతి విజయానికి పాఠశాలనే తొలిమెట్టని అన్నారు. ప్రైమరీ ఇంచార్జ్ సాయి కుమారి, ప్రీ ప్రైమరీ ఇన్చార్జ్ అనిత రెడ్డి విద్యార్థులను మనసారా అభినందించారు. ఈ కార్యక్రమ నిర్వహణ జే. సంజీవ కుమార్, ఎన్ . విజయ్ విజయ వెస్లీ,యం డి.షబ్బీర్ పాష మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.