సర్ ప్రక్రియను పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలి
calendar_today
July 23, 2026
person
Prajagalam News
• ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
(తాండూర్)
సర్ ప్రక్రియను పారదర్శకంగా పకడ్బందీగా నిర్వహించాలని తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. బషీరాబాద్ లోని గుర్రాల అనంతమ్మ గార్డెన్స్ లో బషీరాబాద్ మండలానికి చెందిన బిఎల్ఎ లతో మరియు చెన్నారం గేట్ దగ్గర అనిల్ గార్డెన్స్ లో యాలాల్ మండలానికి చెందిన బిఎల్ఎ లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొని సర్వే పార్టీ శ్రేణులకు సూచనలు సలహాలను అందించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ...బిఎల్ఎ లు కీలకపాత్ర పోషిస్తున్నారని మిగతా 10రోజులు కూడా మీ పాత్ర కీలకంగా ఉండాలని అన్నారు.సర్ ప్రక్రియ ప్రజాస్వామ్యానికి అత్యంత కీలకమని, ప్రతి అర్హులైన ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా బిఎల్ఎ లు శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.ఎవరూ తమ ఓటు హక్కును కోల్పోకుండా ఇంటింటికి వెళ్లి ఓటరు వివరాలను పరిశీలించి, అవసరమైన దరఖాస్తులను సకాలంలో సమర్పించాలని కోరారు.కొత్త ఓటర్ల నమోదు, మరణించిన వారి పేర్ల తొలగింపు, చిరునామా మార్పులు, ఇతర సవరణలను పారదర్శకంగా పూర్తి చేయాలన్నారు.ప్రతి బూత్‌లో కాంగ్రెస్ పార్టీ బలాన్ని మరింత పెంచేందుకు బిఎల్ఎలు ప్రజలతో నిరంతరం అందుబాటులో ఉండి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కారానికి కృషి చేయాలని పేర్కొన్నారు.ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటరు జాబితా స్వచ్ఛతకు అత్యంత ప్రాధాన్యత ఉందని, ప్రతి బిఎల్ఎ బాధ్యతాయుతంగా పనిచేసి నియోజకవర్గంలో వంద శాతం ఖచ్చితమైన ఓటరు జాబితా తయారీలో భాగస్వాములు కావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టిపిసిసి సర్ పర్యవేక్షకులు కోటం వినయ్ రెడ్డి, జగదీశ్వర్ రావు, కాంగ్రెస్ పార్టీ సర్ నియోజకవర్గ కన్వీనర్ పురుషోత్తం రావు, మండల పార్టీ అధ్యక్షుడు రాజవర్ధన్ రెడ్డి, కుర్వ మహిపాల్, ప్రజాప్రతినిధులు, రెండు మండలాల సీనియర్ నాయకులు, బిఎల్ఎ లు వివిధ గ్రామాల సర్పంచ్ లు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.