schedule Wednesday, September 02, 2026

కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల ధాన్యానికి మద్దతు ధర:- డిసిసి ఉపాధ్యక్షుడు బొలుసని భీంరెడ్డి, ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు

calendar_today May 21, 2026
person Prajagalam News
కొనుగోలు కేంద్రాల్లోనే రైతుల ధాన్యానికి మద్దతు ధర:-   డిసిసి ఉపాధ్యక్షుడు బొలుసని భీంరెడ్డి, ఏఎంసి చైర్మన్ బిఎస్ ఆంజనేయులు
(ప్రజాగళం,కుల్కచర్ల)   రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధరకు కొనుగోలు చేసి అండగా నిలుస్తుందని డిసిసి ఉపాధ్యక్షుడు బొలుసని భీంరెడ్డి, కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు, పిఎసిఎస్ చైర్మన్ కనకం మొగులయ్య తెలిపారు.గురువారం కుల్కచర్ల మండల పరిధిలోని పీరంపల్లి గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని, రైతులు నాణ్యమైన ధాన్యాన్ని తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ బి.వెంకటయ్య,రాంరెడ్డి పల్లి సర్పంచ్ నర్సింహులు యాదవ్,కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపాల్ నాయక్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ భరత్ కుమార్ రెడ్డి,కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.