schedule Wednesday, September 02, 2026

కుల్కచర్లలో హక ఫర్టిలైజర్ దుకాణం ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే టిఆర్ఆర్

calendar_today May 25, 2026
person Prajagalam News
కుల్కచర్లలో హక ఫర్టిలైజర్ దుకాణం ప్రారంభించిన పరిగి ఎమ్మెల్యే టిఆర్ఆర్
(ప్రజాగళం,కుల్కచర్ల)   రైతులు ఆధునిక వ్యవసాయ పద్ధతులు అవలంబిస్తూ పంటల దిగుబడిని పెంచుకోవాలని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం కుల్కచర్ల మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన హక ఫర్టిలైజర్ దుకాణంను స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే టి. రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు నాణ్యమైన ఎరువులు, విత్తనాలు అందుబాటు ధరల్లో లభించాలనే ఉద్దేశంతో ఇటువంటి వ్యవసాయ కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లో అవసరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు బోలుసాని భీంరెడ్డి,కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బి.ఎస్ ఆంజనేయులు ముదిరాజ్, బ్లాక్ టు అధ్యక్షుడు కర్రె భరత్ కుమార్,వివిధ గ్రామాల సర్పంచులు మండల నాయకులు, కార్యకర్తలు రైతులు పాల్గొన్నారు.