schedule Wednesday, September 02, 2026

పట్టించుకోని విద్యుత్ అధికారులు,రోజులు గడుస్తున్న త్రీఫేస్ విద్యుత్ కు అంతరాయం,విద్యుత్ అధికారులకు ఇంత నిర్లక్ష్యమా ప్రజల ఆవేదన

calendar_today May 27, 2026
person Prajagalam News
పట్టించుకోని విద్యుత్ అధికారులు,రోజులు గడుస్తున్న త్రీఫేస్ విద్యుత్ కు అంతరాయం,విద్యుత్ అధికారులకు ఇంత నిర్లక్ష్యమా ప్రజల ఆవేదన
  వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం పరిధిలో అల్లాపూర్ (బి) గ్రామంలో ఆరు రోజులు గడిచిన త్రీఫేస్ విద్యుత్ అంతరాయం ఏర్పడిన విద్యుత్ అధికారులు మాత్రం పట్టించుకోవడంలేదని కన్జామర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.విద్యుత్ కన్జమర్లు మాట్లాడుతూ ఆరు రోజుల నుండి అల్లాపూర్ (బి) గ్రామంలో అకాల వర్షాలకు త్రీఫేస్ విద్యుత్ తీగలు తెగపడ్డ లైన్ మెన్ కు చరవాణి ద్వారా సమాచారం తెలిపిన పట్టించుకోవడంలేదని,త్రీఫేస్ విద్యుత్ లేకపోవడంతో త్రాగునీటికి ప్రజలు ఇబ్బంది పడుతున్నారని,అదేవిధంగా బషీరాబాద్ లో జయంతి కాలనీలో వీదురుగాళ్లకు విరిగిపడ్డ చెట్టును విద్యుత్ అధికారులు తొలగించకపోవడం ఇంత నిర్లక్ష్యంగా వివరిస్తున్నారని కన్జ్యూమర్లు ఆవేదన వ్యక్తం చేశారు.ఎన్నిసార్లు చరవాణి ద్వారా సమాచారం అందించిన చేస్తాంలే అంటూ అసిస్టెంట్ల ద్వారా పనులు చేపిస్తున్నారని,వారికి ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు,ప్రభుత్వం జీతాలు లైన్మెన్ కు,పనులు చేసేది అసిస్టెంట్లు ఇప్పటికైనా ఉన్నత అధికారులు వెంటనే స్పందించి నిలిచిన విద్యుత్తు అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరడం జరిగింది.