schedule Wednesday, September 02, 2026

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేసిన బిఆర్ఎస్ పార్టీ యువనాయకుడు వెంకట్

calendar_today June 10, 2026
person Prajagalam News
అంత్యక్రియలకు ఆర్థిక సహాయం అందజేసిన  బిఆర్ఎస్ పార్టీ యువనాయకుడు వెంకట్
(ప్రజాగళం, కుల్కచర్ల)   పేద ప్రజలకు ఆపత్కాలంలో అండగా ఉంటానని బిఆర్ఎస్ పార్టీ యువనాయకుడు ఘణాపురం వెంకట్ తెలిపారు. కుల్కచర్ల మండల పరిధిలోని తన స్వగ్రామం ఘనపూర్ లో బుడ్డోల్ల శ్యామలమ్మ అనారోగ్యంతో మరణించారు.ఈ విషయం స్థానికుల ద్వారా తెలుసుకున్న వెంకట్ తాను అందుబాటులో లేకపోవడంతో తన అనుచరులతో, బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల చేతుల మీదగా ఆ కుటుంబానికి తన వంతుగా 5వేల రూపాయలను అందజేశారు. అంత్యక్రియల కార్యక్రమంలో చిన్నబిజ్జారం రాములు,దయ్యాల మల్లయ్య,కృష్ణ పల్లి చిన్న రాములు,చిన్న బిజారం శ్రీనివాస్,గజ్జి మాసయ్య,బి నర్సింహులు, బి.శ్రీనివాస్ బి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు