schedule Monday, November 02, 2026

శ్రీ ఉడిపి కృష్ణ టిఫిన్స్ ప్రారంభోత్సవంలో బిఎస్ఆర్ 

calendar_today November 1, 2026
person Prajagalam News
శ్రీ ఉడిపి కృష్ణ టిఫిన్స్ ప్రారంభోత్సవంలో బిఎస్ఆర్ 

• నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి

 

(తాండూరు)

పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన శ్రీ ఉడిపి కృష్ణ టిఫిన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమం సందడిగా జరిగింది. ఈ వేడుకకు ఆర్బిఓఎల్ సీఈవో, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి  ముఖ్య అతిథిగా హాజరై నిర్వాహకులను అభినందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాండూరు పట్టణ ప్రజలకు ఉడిపి ప్రత్యేక రుచులతో నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందించాలనే లక్ష్యంతో నూతనంగా టిఫిన్స్ సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూ, వ్యాపార రంగంలో అంచెలంచెలుగా అభివృద్ధి సాధించాలని నిర్వాహకులకు ఆకాంక్షించారు.ఈ సందర్భంగా నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి వ్యాపారం దినదినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.