ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటాం మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి
November 2, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో గొట్టిగా కాలన్,కొత్లా పూర్,దామర్ చెడ్ గ్రామాలలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సందర్శించారు. అదేవిధంగా అనారోగ్యంతో మృతి చెందిన వారి కుటుంబ సభ్యులు పరామర్శించి, అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఆరోగ్య పరిస్థితులు యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ తాండూరు నియోజకవర్గం ఇంచార్జి శ్రీశైల్ రెడ్డి,బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు నర్సిరెడ్డి (రాజు పటేల్),గొట్టిగా కాలన్ గ్రామ సర్పంచ్ సాబేర్,కొత్లా పూర్ గ్రామ సర్పంచ్ రాగిణి బాయి శ్రీనివాస్,దామర్ చెడ్ గ్రామ సర్పంచ్ భారతి శ్రీనివాస్ రెడ్డి,నీళ్ళ పల్లి గ్రామ సర్పంచ్ వేణు గోపాల్ రెడ్డి,అల్లపూర్ (బి) గ్రామ సర్పంచ్ జంగం వీరయ్య,కోర్వి చెడ్ గ్రామ సర్పంచ్ నవీన్ రెడ్డి,బిఅర్ఎస్ పార్టీ నాయకులు వెంకట్ రెడ్డి,శంకర్ నాయక్,చౌవాన్ శ్రీనివాస్,ఇర్ఫాన్, తదితరులు పాల్గొన్నారు.