పక్క దారి పడుతున్న మోరం, అనుమతులు ఉన్నాయంటూ ఇష్టారాజ్యంగా తవ్వకాలు
November 1, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో మైల్వార్ గ్రామ శివారులో కాంట్రాక్టర్లు ఇష్టారాజంగా మొరం తవ్వకాలు, మొరం తవ్వి ప్రైవేటు స్థలాలకు అమ్ముకొని సొమ్ము చేసుకుంటారని, అధికారుల నిఘా కరువైందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గతంలో ప్రభుత్వ నిధులతో ఫార్మేషన్ వెయ్యగా,ఇంకా బిల్లులు రాకముందే పెద్ద టిప్పర్లతో లోడు బండ్లు రాకపోకలతో వేసిన ఫార్మేషన్ రోడ్డు ధ్వంసం అయిందని గ్రామ సర్పంచ్ భర్త కాలిల్ ఆవేదన వ్యక్తం చేశారు.ఇలాంటి వారిపై ప్రభుత్వ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని కోరడం జరిగింది.