schedule Monday, November 02, 2026

బాధితుడికి భరోసాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్

calendar_today November 2, 2026
person Prajagalam News
బాధితుడికి భరోసాగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
 

బాధిత కుటుంబానికి రూ. 2 లక్షల 50 వేల ఎల్ ఓ సి అందజేత

  • వికారాబాద్-: అనారోగ్యంతో బాధ పడుతున్న వారికి అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గానికి చెందిన కమ్మరి రంగయ్య కుమారుడు మహితేజ వైద్య చికిత్స కోసం తెలంగాణ శాసనసభ సభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ రూ. 2,50,000 ల ఎల్ ఓ సి ని మంజూరు చేయించారు.మహితేజ కుటుంబ ఆర్థిక పరిస్థితిని తెలుసుకున్న వెంటనే స్పీకర్ ప్రసాద్ కుమార్ చలించిపోయారు. వెంటనే స్పందించి, ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఎల్ ఓ సీ మంజూరయ్యేలా ప్రత్యేక చొరవ తీసుకున్నారు.ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ...కమ్మరి రంగయ్య కుమారుడు మహితేజ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానని అన్నారు.నా నియోజకవర్గంలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా నేను అండగా ఉంటానని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తెలిపారు. కమ్మరి రంగయ్య కుటుంబానికి ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
- స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బాధిత కుటుంబం కృతజ్ఞతలు
  • అత్యవసర సమయంలో ఆదుకుని రూ. 2,50,000/- ల ఎల్ ఓ సి ని మంజూరు చేయించిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కమ్మరి రంగయ్య కుటుంబ సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
    సుద్దగళ్ల వెంకటేష్ జిల్లా రిపోర్టర్