schedule Wednesday, September 02, 2026

నేటి విద్యార్థులే రేపటి తరానికి మార్గదర్శకులు.  :-లాల్ సింగ్ తండా సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్(జీవిఎస్))

calendar_today June 18, 2026
person Prajagalam News
నేటి విద్యార్థులే రేపటి తరానికి మార్గదర్శకులు.  :-లాల్ సింగ్ తండా సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్(జీవిఎస్))
(ప్రజాగళం, కుల్కచర్ల) వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల పరిధిలోని లాల్ సింగ్ తండాలోని పాఠశాలలో అక్షరాభ్యాసం కార్యక్రమంలో భాగంగా చిన్నారులతో గ్రామ సర్పంచ్ రాథోడ్ శ్రీనివాస్ నాయక్ పలకలపై అక్షరాలు రాయించారు.ఈ సందర్బంగా గ్రామ సర్పంచ్,గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థులు చదువులో క్రీడల్లో రాణించాలని వారికి నాణ్యమైన భోజనాన్ని అందిస్తున్నామని కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా బ్రేక్ ఫాస్ట్ కూడా అందించడం జరిగిందని విద్యార్థులకు ఏ లోటు లేకుండా నోటు పుస్తకాలు కూడా అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో  మహిళా సంఘం అధ్యక్షురాలు శాంతమ్మ, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు ఆస్మా, తండావాసులు గోపాల్ నాయక్, రవి నాయక్, లౌడియా రవి, పి గోపాల్, శంకర్, దశరథ్ నాయక్ ,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.