schedule Wednesday, September 02, 2026

జయశంకర్ సార్ ఆశయాలే తెలంగాణకు దిక్సూచి

calendar_today June 21, 2026
person Prajagalam News
జయశంకర్  సార్ ఆశయాలే తెలంగాణకు దిక్సూచి
(తాండూర్) జయశంకర్ సార్ ఆశయాలు తెలంగాణకు దిక్సూచి అని టిఆర్ఎస్వి నాయకులు అన్నారు. ఆదివారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ ఆచార్య కొత్తపల్లి జయశంకర్  వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా బీఆర్ఎస్వి నాయకులు దత్తాత్రేయ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఆచార్య జయశంకర్  సార్  ఆలోచనలు, సిద్ధాంతాలు మరియు త్యాగాలు ఎంతో ప్రేరణగా నిలిచాయని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను ప్రపంచానికి చాటి చెప్పి, ప్రత్యేక రాష్ట్ర సాధనకు మార్గదర్శకుడిగా నిలిచిన మహనీయుడు జయశంకర్  సార్ అని  కొనియాడారు.తెలంగాణ యువత ఆయన ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఆయన సేవలను స్మరించుకుంటూ రెండు నిమిషాల మౌనం పాటించి ఘన నివాళులు అర్పించారు.