schedule Saturday, September 05, 2026

ముజాహిద్ పూర్ లో ఘనంగా రంజాన్ వేడుకలు

calendar_today March 21, 2026
person Prajagalam News
ముజాహిద్ పూర్ లో ఘనంగా రంజాన్ వేడుకలు
  రంజాన్ వేడుకల్లో పాల్గొన్న ఏఎంసీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు కుల్కచర్ల: మత సామరస్యం ఆధ్యాత్మికతకు రంజాన్ ఎంతో పవిత్ర మైనదని కుల్కచర్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బిఎస్ ఆంజనేయులు,ముజాహిద్ పూర్ సర్పంచ్ చంద్రభూపాల్ అన్నారు. శనివారం కుల్కచర్ల మండల పరిధిలోని ముజాహిద్ పూర్ గ్రామంలో రంజాన్ పండుగను పురస్కరించుకుని ఈద్గా వద్ద ముస్లిం సోదరులకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సోమలింగం,తుల్సిరాం నాయక్, వార్డు సభ్యుడు భాస్కర్,షర్పోద్దీన్, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు