schedule Wednesday, September 02, 2026

రంజాన్ విందులో పాల్గొన్న చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి.

calendar_today March 21, 2026
person Prajagalam News
 తాండూర్: రంజాన్ పండుగను పురస్కరించుకొని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి తాండూరు పట్టణంలోని పాత తాండూర్ కు చెందిన నాయకులు నయీమ్ ఖాన్ ఇచ్చిన రంజాన్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ని నయీమ్ ఖాన్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మహేందర్ రెడ్డి మాట్లాడుతూ ముస్లిం సోదరులు నెలరోజుల పాటు ఎంతో నిష్టతో పవిత్రంగా ఉంటూ ఉపవాస దీక్షలు నిర్వహించి రంజాన్ పండుగను జరుపుకోవడం సంతోషకరమని రాష్ట్ర ప్రజలకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట నాయకులు కరణం పురుషోత్తం రావు, బీర్కట్ రఘు, అబ్దుల్ ఖవి, తదితరులు ఉన్నారు.