• ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి చేతుల మీదుగా రేపు చెక్కుల పంపిణీ
• కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బాతుల నాగరాజు
(తాండూర్)
నిరుపేదలకు అండగా నిలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేస్తోందని తాండూర్ టౌన్ కాంగ్రెస్ అధ్యక్షులు బాతుల నాగరాజు అన్నారు. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి నాయకత్వంలో నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. తాండూర్ నియోజకవర్గంలోని నాలుగు మండలాలకు చెందిన సుమారు 200 మంది లబ్ధిదారులకు రూ.1.5 కోట్ల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్ఎఫ్) చెక్కులను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి రేపు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 2న బుధవారం మధ్యాహ్నం 3 గంటలకు తాండూర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యక్రమం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కాంగ్రెస్ నాయకులు, ప్రజాప్రతినిధులు, సర్పంచ్‌లు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని బాతుల నాగరాజు కోరారు.