schedule Sunday, September 06, 2026

రంజాన్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి... ప్రభుత్వ చీఫ్ విప్ మహేందర్ రెడ్డి

calendar_today March 21, 2026
person Prajagalam News
    తాండూరు: రంజాన్ పండుగను ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి అన్నారు. శనివారం రంజాన్ పండుగ సందర్భంగా సందర్భంగా పట్టణంలోని 33 వ వార్డు చెందిన (లైట్ హౌస్ షాప్) మైనార్టీ యువ నాయకులు ఆరిఫ్ పటేల్ ఇచ్చిన రంజాన్ విందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముస్లింల పవిత్ర దైవ గ్రంథం ఖురాన్ అవతరించిన మాసం రంజాన్ అని ఈ నెలలో ముస్లింలు భక్తిశ్రద్ధలతో ఉపవాసాలు ఫిత్రా జకాత్ దానధర్మాలు చేస్తుంటారని అన్నారు . పండుగలు మన జీవన స్రవంతిలో భాగమై మన జాతీయతకు, సంస్కృతీ వికాసానికి దోహదం చేస్తాయని అన్నారు.ఈ విందులో నాయకులు కరణం పురుషోత్తం రావు, డాక్టర్ సంపత్ కుమార్, బిర్కట్ రఘు, కల్వ సుధాకర్, సయ్యద్ ఖాజా పటేల్, టోపీ పటేల్, అరీఫ్ పటేల్, తదితరులు పాల్గొన్నారు.