schedule Thursday, September 03, 2026

పైలెట్ ను కలిసిన బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్లు

calendar_today July 29, 2026
person Prajagalam News
పైలెట్ ను కలిసిన బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కౌన్సిలర్లు
  (తాండూరు) తాండూరు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పట్లోళ్ల దీప నర్సింలు ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు హైదరాబాద్‌లోని నివాసంలో మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ని మర్యాదపూర్వకంగా కలిశారు.ఈ సందర్భంగా తాండూరు పట్టణంలోని ప్రజా సమస్యలు, మున్సిపల్ అభివృద్ధి పనులు, పార్టీ బలోపేతం, రాబోయే కార్యక్రమాలపై సుదీర్ఘంగా చర్చించారు. ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని, పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేసి బీఆర్ఎస్‌ను మరింత బలోపేతం చేయాలని పైలెట్ రోహిత్ రెడ్డి సూచించినట్లు నాయకులు తెలిపారు.ఈ భేటీలో ప్రజా సమస్యలను పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని, తాండూరు అభివృద్ధికి తమ వంతు సహకారం అందిస్తామని పైలెట్ రోహిత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.