schedule Sunday, September 06, 2026

వికారాబాద్ లో ఘనంగా రంజాన్

calendar_today March 22, 2026
person Prajagalam News
వికారాబాద్ లో ఘనంగా రంజాన్
  వేడుకల్లో పాల్గొన్న స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
  • వికారాబాద్ జిల్లా:-
రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పర్వదినం సందర్భంగా వికారాబాద్ పట్టణం పరిధిలోని ఆలంపల్లి ఆలం షాహి దర్గా వద్ద శనివారం ముస్లిం సోదరులను తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం వికారాబాద్ పట్టణంలోని పలువురు ముస్లిం నాయకుల ఇంటికి వెళ్ళి రంజాన్ వేడుకలలో పాల్గొని కుటుంబ సభ్యులకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఏ ఎం సి చైర్మన్ శ్రీనివాస్ ముదిరాజ్,మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం అనన్య,వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి, ముస్లిం నాయకులు  తదితరులు పాల్గొన్నారు.