schedule Thursday, September 03, 2026

తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహనా కల్పించాలి :- వికారాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ లాల్, కుల్కచర్ల సర్పంచ్ వార్వాల అంజిలయ్య

calendar_today August 3, 2026
person Prajagalam News
తల్లి పాల ప్రాముఖ్యతపై అవగాహనా కల్పించాలి  :- వికారాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ లాల్, కుల్కచర్ల సర్పంచ్ వార్వాల అంజిలయ్య
(ప్రజాగళం,కుల్కచర్ల)
తల్లి పాలు అమృతంతో సమానం అని, తల్లి పాల ప్రాముఖ్యతపై వైద్య సిబ్బంది అవగాహనా కల్పించాలని వికారాబాద్ జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుధాకర్ లాల్, కుల్కచర్ల సర్పంచ్ వార్వాల అంజిలయ్య తెలిపారు. తల్లి పాల వారోత్సవాల్లో భాగంగా సోమవారం కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మండల వైద్యాధికారి డాక్టర్ కిరణ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని గర్భిణిలు, బాలింతలకు అవగాహన కల్పించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ పుట్టిన బిడ్డకు తల్లి పాలు పట్టించడం ద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుందన్నారు. పిల్లలకు పాలు ఇవ్వడం ద్వారా తల్లులకు రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉంటుందన్నారు. తల్లిపాలలో అన్ని రకాలైన పోషకాలు ఉండటం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని చెప్పారు. ఆరు నెలల వరకు పిల్లలకు తల్లిపాలు మాత్రమే పట్టించాలని తెలియజేశారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా నాయకులు గాదె.మహిపాల్,సూపర్వైజర్ యాదమ్మ, ఏఎన్ఎం జంగమ్మ, మంగమ్మ,
ఆసుపత్రి సిబ్బంది,గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు.