schedule Thursday, September 03, 2026

రాష్ట్రస్థాయికి ఎంపికైన ఆదర్శ పాఠశాల విద్యార్థి వార్వాల.అరుణ్ కుమార్ 

calendar_today August 3, 2026
person Prajagalam News
రాష్ట్రస్థాయికి ఎంపికైన ఆదర్శ పాఠశాల విద్యార్థి వార్వాల.అరుణ్ కుమార్ 
(ప్రజాగళం, కుల్కచర్ల)   వికారాబాద్ జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆగస్టు 1వ తేదీన తాండూరులో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలలో తెలంగాణ ఆదర్శ పాఠశాల జూనియర్ కళాశాల, ముజాహిద్ పూర్ విద్యార్థి అరుణ్ కుమార్ అద్భుతమైన ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. లాంగ్ జంప్ లో ప్రథమ స్థానం (బంగారు పతకం),జావెలిన్ త్రో లో ద్వితీయ స్థానం,100 మీటర్ల పరుగు పందెంలో ద్వితీయ స్థానంతో అత్యుత్తమ ప్రతిభను కనబరిచాడు. త్వరలో వరంగల్ లో జరగనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక కావడం ముజాహిద్ పూర్ ఆదర్శ పాఠశాలకు, వికారాబాద్ జిల్లాకు ఎంతో గర్వకారణం అని పాఠశాల వైస్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్ విద్యార్థి అరుణ్ కుమార్ ను ప్రత్యేకంగా అభినందించారు. రాష్ట్ర స్థాయిలో కూడా అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజయం సాధించి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో వ్యాయామ ఉపాధ్యాయుడు కృష్ణారెడ్డి, ఉపాధ్యాయ బృందం,పాఠశాల విద్యార్థులు పాల్గొని అరుణ్ కుమార్ కు శుభాకాంక్షలు తెలియజేశారు.