schedule Wednesday, September 02, 2026

తాజా,మాజీ సర్పంచుల మధ్య పాత బిల్లుల పంచాయతీ

calendar_today August 8, 2026
person Prajagalam News
తాజా,మాజీ సర్పంచుల మధ్య పాత బిల్లుల పంచాయతీ
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో నంద్యా నాయక్ తండాలో గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ శంకర్ నాయక్ పాత బిల్లులు చెల్లించాలంటూ ఎంపీడీవో కార్యాలయంలో హల్ చల్ చేశారు.ఈ సందర్భంలో ఎంపీడీవో సంపత్ కుమార్ మాజీ సర్పంచ్ శంకర్ నాయక్,ప్రస్తుత సర్పంచ్ సున్నీ భాయ్ భర్త శ్రీనివాస్ ను కార్యాలయానికి పిలిపించి ఇద్దరినీ సముదాయించి పాత బిల్లుల రికార్డులు తీసుకువస్తే వెంటనే నిధులు విడుదల చేసి చెక్కు ఇస్తానని ఎంపీడీవో సంపత్ కుమార్ తెలిపారు.కార్యాలయంకు వచ్చి ఇలా అధికారులను విసిగించవద్దని,ఇక్కడ ఎలాంటి గలాట చేయవద్దని తెలిపారు.