కుల్కచర్లలో దేశభక్తి స్పూర్తితో- త్రివర్ణ పతాకాల రెపరెపల మధ్య ఘనంగా తిరంగా ర్యాలీ
August 14, 2026
Prajagalam News
(ప్రజాగళం, కుల్కచర్ల)
భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ కుల్కచర్ల మండల అధ్యక్షుడు గుడాల వెంకటేష్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలో ఘనంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు.
ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర బీజేపి సీనియర్ నాయకుడు కరణం ప్రహ్లాద్ రావు, ఓబీసీ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్న ఈశ్వరప్ప తిరంగా ర్యాలీలో విద్యార్థులు, యువజన సంఘాల సభ్యులతో కలిసి జాతీయ జెండాలను చేతబూని దేశభక్తి నినాదాలతో కుల్కచర్ల మండల కేంద్రంలోని ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. “భారత్ మాతాకీ జై”, “వందే మాతరం”, “జై హింద్” అంటూ నినాదాలు చేస్తూ దేశభక్తిని చాటారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ
దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయులను స్మరించుకుంటూ, వారి త్యాగాల ఫలితంగానే నేడు స్వేచ్ఛా భారతదేశంలో జీవిస్తున్నామని పేర్కొన్నారు.
యువతలో దేశభక్తి భావనను మరింత పెంపొందించడంతో పాటు, ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధిలో తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని పిలుపునిచ్చారు. ఈ తిరంగా ర్యాలీలో స్థానిక సర్పంచ్ వార్వళ్ళ అంజిలయ్య,టెలికాం బోర్డు సభ్యులు ఘణపురం వెంకటయ్య గౌడ్,జానకి రాం, గాదె మహిపాల్, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువత,వివిధ పాఠశాల, కళాశాల విద్యార్థులు, దేశభక్తులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.