schedule Thursday, September 03, 2026

పోలీస్ వాహనాన్ని గుద్దిన ఇసుక మాఫియా

calendar_today March 24, 2026
person Prajagalam News
పోలీస్ వాహనాన్ని గుద్దిన ఇసుక మాఫియా
  ఇసుక మాఫియా బరితెగింపు వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో కోర్వి చెడ్ ఘని గ్రామం దగ్గర తెల్లవారుజామున రెండు ఇసుక ట్రాక్టర్ లు కనిపించడంతో ఎస్.ఐ వి.శ్రీశైలం పోలీస్ వాహనంతో వెంబడించగా ట్రాక్టర్ నడిపిస్తున్న డ్రైవరు గమనించి వేగంతో వెళ్తూ ఇసుక ఉన్న ట్రాలీనీ ఖాళీ చేస్తూ పొలంలోకి దూసుకుపోయారు. అంతలోనే పోలీస్ వాహనానికి ఇసుక ట్రాక్టర్ తో గుద్దడంతో పోలీసు వాహనం అక్కడేకక్కడే టైరు పగలడం, వాహనం ముందు భాగం ధ్వంసం కావడం జరిగిందని, వెంటనే పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వడంతో పోలీసులు,ఎస్.ఐ రంగంలోకి దిగి గాలింపు చేసి ఇసుక ట్రాక్టర్ లను పట్టుకున్నట్లు ఎస్.ఐ వి.శ్రీశైలం తెలిపారు.