రూ.3లక్షల ఎల్ఓసి ని అందజేసిన రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
August 21, 2026
Prajagalam News
Vikarabad :-ఇటీవల అనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని 23 వార్డ్ వెంకటేశ్వర కాలానికి చెందిన మొహ్మద్ ఆర్మన్ తండ్రి మొహ్మద్ అజీమ్ కి చికిత్స నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి క్రింద రూ.3 లక్షల విలువ గల ఎల్ఓసిని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ...కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వం పేదల వైద్యం కోసం పెద్ద పీట వేస్తుందని తెలిపారు.