• అర్హులైన ప్రతి కుటుంబానికి ప్రభుత్వ పథకాల ఫలాలు అందాలి
• ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి
(తాండూరు)
ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులైన ప్రజలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పిలుపునిచ్చారు. GPR గార్డెన్స్‌లో పెద్దేముల్ మండలానికి చెందిన అర్హులైన లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై లబ్ధిదారులకు డిజిటల్ రేషన్ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రేషన్ కార్డు కేవలం నిత్యావసర సరుకులు పొందేందుకు మాత్రమే కాకుండా, ప్రభుత్వం అమలు చేస్తున్న అనేక సంక్షేమ పథకాలకు అర్హత కల్పించే ముఖ్యమైన గుర్తింపు పత్రంగా ఉపయోగపడుతుందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజల సంక్షేమం, పేద కుటుంబాల ఆర్థిక భద్రతకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ఆయన అన్నారు. అర్హత ఉన్నప్పటికీ ఇప్పటివరకు రేషన్ కార్డు పొందని వారు సంబంధిత అధికారులను సంప్రదించి తమ వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.డిజిటల్ విధానంతో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ మరింత పారదర్శకంగా, సులభతరంగా మారుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాల అమలులో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని లబ్ధిదారులకు భరోసా ఇచ్చారు.పెద్దేముల్ మండలంలోని గ్రామీణ ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలు పూర్తిస్థాయిలో అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రజల అవసరాలను గుర్తించి అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు ధారాసింగ్, పెద్దముల్ మండల అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, రెవెన్యూ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.