schedule Wednesday, September 02, 2026

ఆపదలో అండగా యువ చైతన్య ట్రస్ట్....

calendar_today August 23, 2026
person Prajagalam News
ఆపదలో అండగా యువ చైతన్య ట్రస్ట్....
  ⇒ట్రస్ట్ చైర్మన్ ఎం.చైతన్య కిరణ్
  • Vikarabad:- ఎవ్వరికీ ఏ ఆపద వచ్చిన యువ చైతన్య ట్రస్ట్ అండగా ఉంటుందని ఆ ట్రస్ట్ చైర్మన్ ఎం.చైతన్య కిరణ్ తెలిపారు. వికారాబాద్ నియోజకవర్గ పరిధిలోని రోంపల్లిలో మరణించిన వారి కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలిపి, ఆర్థిక సాయాన్ని యువ చైతన్య ట్రస్ట్ చైర్మన్ ఎం. చైతన్య కిరణ్ అందజేశారు.అందులో భాగంగా బంట్వారం మండలం రోంపల్లి గ్రామంలో ఇటీవల మరణించిన వారి కుటుంబాలను యువ చైతన్య ట్రస్ట్ చైర్మన్ యం. చైతన్య కిరణ్ పరామర్శించారు.అనంతరం ఆయా కుటుంబాలకు రూ. 10,000/-ల ఆర్థిక సాయాన్ని అందజేశారు.గ్రామానికి చెందిన జనుముల లాలప్ప అనారోగ్యంతో మృతి చెందగా, వారి నివాసానికి వెళ్లిన చైతన్య కిరణ్ కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని చెప్పి రూ. 5,000/-ల ఆర్థిక సాయం అందించారు.అలాగే అదే గ్రామానికి చెందిన హన్మప్ప మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, వారి అంత్యక్రియల ఖర్చుల నిమిత్తం మరో రూ. 5,000/-ల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి యువ చైతన్య ట్రస్ట్ ఎల్లవేళలా అండగా ఉంటుందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ శ్రీనివాస్, యువ చైతన్య ట్రస్ట్ నాయకులు మల్లేశం, ప్రవీణ్, నర్సింలు, నరేష్, వెంకట్, రాములు, యూసుఫ్, కావలి శ్రీను, జనార్ధన్, సిహెచ్. రాజు, అంజయ్య, నాగాయితో పాటు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.