నీటిబొట్టును ఒడిసి పట్టు,భూగర్భ జలాలను కాపాడుదాం
August 25, 2026
Prajagalam News
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలో అల్లాపూర్, మాసన్ పల్లి, బాబూనాయక్ తండా, పర్వాత్ పల్లి,మంతట్టి గ్రామాలలో జల సంరక్షణ కోసం
జల్ సంచయ్_ జెన్ భాగీ దారి,జల సంరక్షణ కొరకు
విబిజి రాంజీ పథకంలో చేపట్టిన పనులను పరిశీలించడానికి డాక్టర్ ఎస్.ఎస్ విఠల్ సీనియర్ శాస్త్రవేత్త,కేంద్రం గ్రౌండ్ వాటర్ బోర్డు, హైదరాబాద్ చీఫ్ నోడల్ అధికారి, మినిస్ట్రీ ఆఫ్ జలశక్తి , గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వికారాబాద్ జిల్లా ఇన్స్పెక్షన్ అధికారి, జిల్లా అడిషనల్ డిఆర్డిఓ ఎం.సత్తయ్య, టెక్నికల్ కోఆర్డినేటర్ జె.సైదులు జల సంరక్షణ కోసం చేపట్టిన పనులు వర్షం నీటిని సంరక్షించే రూప్ టాప్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్లు,ఫీడర్ ఛానల్ డిసిల్టింగ్ పనులు, ఊట కుంటలు,చెక్ డ్యాముల పనులను పరిశీలించారు. అదేవిధంగా ప్రతి గ్రామంలోనూ హరితహారం కార్యక్రమాన్ని చేపట్టండి అన్ని అన్నారు.ఈ కార్యక్రమం ఎంపీడీవో సంపత్ కుమార్,ఏపీఓ శారదా,ఈ సీ నర్సింహా రెడ్డి,వివిధ గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.