ప్రజలకు అందుబాటులో శ్రీ వెంకటేశ్వర డిజిటల్ సేవా కేంద్రం
August 30, 2026
Prajagalam News
⇒ప్రారంభించిన 8వ వార్డు కౌన్సిలర్ జి.పాండు
- Vikarabad -: ప్రజలకు అన్ని రకాల ఆన్లైన్ సర్వీస్ అందించేందుకు శ్రీ వెంకటేశ్వర డిజిటల్ సేవా కేంద్రం ఏర్పాటు చేయడం శుభ పరిణామం అని వికారాబాద్ మున్సిపల్ 8వ వార్డు కౌన్సిలర్ జి.పాండు అన్నారు.ఆదివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆర్డిఓ కార్యాలయం ముందు,తహసీల్దార్ కార్యాలయము పక్కన శ్రీ వెంకటేశ్వర డిజిటల్ సేవా కేంద్రం (సిఎస్ సి) ను మద్గుల్ చిట్టంపల్లి వార్డు కు చెందిన అన్నసారం వెంకటేష్ నిర్వహించగా , 8వ వార్డు కౌన్సిలర్ జి.పాండు దీనిని ప్రారంభించారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ పాండు మాట్లాడుతూ...యువత అన్ని రంగాల్లో రాణించాలని తెలిపారు.నేటికాలంలో ఆన్లైన్ సేవలు లో భవిష్యత్ ఉంటుందని చెప్పారు.డిజిటల్ సేవా కేంద్రం ద్వారా ప్రజలకు అవసరం అగు సీఎస్ సి సర్వీస్,రేషన్ కార్డు అప్లై ,ఓటర్,ఆధార్,ల్యాండ్ రిజిస్ట్రేషన్ స్లాట్ స్లాట్ బూక్ తదితర సేవలు అందిస్తారని అన్నారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణ మాజీ అధ్యక్షులు కె.గోపాల్,బీఆర్ఎస్ పార్టీ నాయకులు నర్సింహులు,సారం శంకరయ్య,వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.