schedule Wednesday, September 02, 2026

ఇందిరమ్మ ఇల్లుతో .. పేదల సొంతింటి కల సాకారం

calendar_today August 31, 2026
person Prajagalam News
ఇందిరమ్మ ఇల్లుతో .. పేదల సొంతింటి కల సాకారం
• దౌలపూర్‌లో నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే (తాండూర్) పేద, మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలను సాకారం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి  అన్నారు. యాలాల్ మండలం దౌలపూర్ గ్రామంలో నూతనంగా నిర్మించిన షబానా ఉస్సేన్ ఖాద్రి దంపతుల ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశ కార్యక్రమానికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి హాజరయ్యారు . అనంతరం నూతన గృహంలోకి కుటుంబ సభ్యులతో కలిసి ప్రవేశించి వారికి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇల్లు అనేది ప్రతి కుటుంబానికి ఒక భద్రత, ఆత్మగౌరవం, భవిష్యత్తుపై భరోసా అని అన్నారు. సొంతింటి కల సాకారమైన కుటుంబాల ఆనందంలో భాగస్వాములు కావడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి చేకూరేలా కృషి చేస్తున్నామని తెలిపారు.ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా పేదల సొంతింటి కలను నెరవేర్చేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.