సీనియర్ అడ్వకేట్ నర్సింహరావును పరామర్శించిన బిఎస్ఆర్
August 31, 2026
Prajagalam News
( తాండూర్)
సీనియర్ అడ్వకేట్ నర్సింహరావు నివాసానికి ఆర్బీఓఎల్ సీఈఓ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి వెళ్లి వారిని ఆత్మీయంగా పరామర్శించారు. ఇటీవల అనారోగ్యానికి గురైన నర్సింహరావు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న ఆయన, ప్రస్తుత పరిస్థితిపై కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడారు.ఈ సందర్భంగా నర్సింహరావు తో కొద్దిసేపు ఆత్మీయంగా మాట్లాడిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి ధైర్యంగా ఉండాలని సూచించారు. త్వరగా పూర్తిస్థాయిలో కోలుకుని సాధారణ ఆరోగ్యంతో ఉండాలని ఆకాంక్షించారు. అవసరమైన సమయంలో తాను, అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. ఈ ఆత్మీయ సమావేశంలో కాంగ్రెస్ యువ నాయకులు రొంపల్లి సంతోష్ కుమార్, జోషి వికాస్ ఉన్నారు.