schedule Monday, November 02, 2026

ప్రజలకు ఆపత్కాలంలో అండగా ఉంటాం:-  బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు వార్ల.వెంకట్ 

calendar_today September 12, 2026
person Prajagalam News
ప్రజలకు ఆపత్కాలంలో అండగా ఉంటాం:-    బిఆర్ఎస్ పార్టీ యువ నాయకుడు వార్ల.వెంకట్ 
  కుల్కచర్ల, నిరుపేద ప్రజలకు ఆపత్కాలంలో అండగా ఉంటానని బిఆర్ఎస్ పార్టీ యువనాయకుడు వార్ల వెంకట్ అన్నారు.శనివారం ఘణాపూర్ గ్రామ పంచాయతీ అనుబంధ తండా గోపి నాయక్ తండాకు చెందిన నేనావత్ సోనీ మరణించిన విషయం తెలుసుకున్న వార్ల వెంకట్ అక్కడికి వెళ్లి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అనంతరం అంత్యక్రియల నిమిత్తం 5వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఆయన వెంట పాండే నాయక్, వార్డు సభ్యుడు బాబు, గిరిజన తండావాసులు ఉన్నారు