schedule Tuesday, November 03, 2026

పోచమ్మ తల్లి దేవాలయ అభివృద్ధికి లక్ష విరాళం అందజేసిన మహేశ్వరం రాములు గౌడ్

calendar_today September 17, 2026
person Prajagalam News
పోచమ్మ తల్లి దేవాలయ అభివృద్ధికి లక్ష విరాళం అందజేసిన మహేశ్వరం రాములు గౌడ్
కుల్కచర్ల, వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని శ్రీ పోచమ్మ తల్లి దేవాలయ అభివృద్ధి పనులకోసం మండల పరిధిలోని తిర్మలాపూర్ గ్రామానికి చెందిన, శ్రీ లక్ష్మి రైస్ మిల్ యజమాని మహేశ్వరం రాములు గౌడ్ తనవంతుగా ఒక లక్ష రూపాయల విరాళాన్ని ఆలయ కమిటీ సభ్యులకు ఆలయ ప్రాంగణంలో అందజేశారు. ఈ సందర్బంగా పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ సభ్యులు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఆలయ అభివృద్ధికి సహకరించడం అభినందనీయం అని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు కర్రె భరత్ కుమార్,తుప్పలి వెంకటేషం,వెంకటయ్య,జెట్టిగళ్ళ.వెంకటయ్య,బిచ్చన్న,రవికుమార్,7వ వార్డు సభ్యుడు కర్రె. వినోద్ కుమార్,బాబు,గ్రామస్థులు మాజీ ఎంపిటిసి మాలె కృష్ణయ్య గౌడ్, అశోక్ గౌడ్,భృంగి శ్రీశైలం, రాజయ్య తదితరులు పాల్గొన్నారు