schedule Tuesday, November 03, 2026

ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది

calendar_today September 20, 2026
person Prajagalam News
ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైంది
 

ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి

  • Vikarabad-:ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని,సమాజంలో గురువు పాత్ర కీలకం అని ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి అన్నారు.ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వికారాబాద్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో గురువందన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షులు కూర సంగమేశ్వర్ అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి, ముఖ్య వక్తగా అప్పల ప్రసాద్ ,గౌరవ అతిథులుగా టిపియూ ఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాజశేఖర్,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలకపల్లి పెంటయ్య హాజరయ్యారు.ఈ సందర్భంగా జిల్లాలో విశిష్ట సేవలు అందించిన 80 మంది ఉపాధ్యాయులను, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను శాలువా, మెమెంటోతో ఘనంగా సన్మానించడం జరిగింది.అనంతరం వారు మాట్లాడుతూ.... ఉపాధ్యాయ వృత్తి అత్యంత పవిత్రమైనదని, సమాజ నిర్మాణంలో గురువు పాత్ర కీలకమని తెలిపారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి టిపియూ ఎస్ ఎల్లప్పుడూ ముందుంటుందని, ఉపాధ్యాయులకు ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర బాధ్యులు కొత్తగాడి అంజిరెడ్డి, మహేంద్ర బహదూర్, ఆనందం రాములు, జాక వెంకటేశం, వెంకటయ్య, కమల్ రెడ్డి, బుచ్చిలింగం, జిల్లా ప్రధాన కార్యదర్శి గాజుల బస్వరాజ్,జిల్లా కోశాధికారి రమేష్ యాదవ్, జిల్లా మహిళా విభాగం నాయకురాలు శ్రీలత రెడ్డి, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.