schedule Monday, November 02, 2026

క్రీడాకారుల పట్ల పూర్తి బాధ్యతతో క్రీడలు నిర్వహించాలి

calendar_today September 20, 2026
person Prajagalam News
క్రీడాకారుల పట్ల పూర్తి బాధ్యతతో క్రీడలు నిర్వహించాలి

తెలంగాణ రాష్ట్ర త్రో బాల్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.రవి కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి.కృష్ణారెడ్డి

  • Vikarabad-:క్రీడాకారులు పూర్తి బాధ్యతతో క్రీడలు నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర త్రో బాల్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ పి.రవి కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి.కృష్ణారెడ్డి లు తెలిపారు. ఆదివారం తెలంగాణ రాష్ట్ర త్రో బాల్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం ఆదివారం జరిగింది. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, జిల్లాల్లో నిర్వహించే త్రో బాల్ పోటీలలో పాల్గొనే క్రీడాకారుల బాధ్యతలు నిర్వహకులు తీసుకోవాల్సిందేనని స్పష్టం చేశారు. క్రీడాకారులకు ఏర్పాటు చేసే వసతి, భోజనం, రవాణ వ్యవస్థలో రాజీ పడేది లేదన్నారు. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పిస్తే క్రీడలలో రాణిస్తారని తెలిపారు. రాష్ట్ర కమిటీ తరపున తమ సహాయ, సహాకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కెఎన్ పూర్ణచంద్ర రావు, కోశాధికారి షైక్ జమీల్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీధర్, నాయకులు పద్మ గౌడ్, ప్రవీణ్ చారి, పూలేందర్ తదితరులు పాల్గొన్నారు.