schedule Monday, November 02, 2026

తాపస్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం

calendar_today September 20, 2026
person Prajagalam News
తాపస్ ఆధ్వర్యంలో ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సత్కారం
కుల్కచర్ల:- తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లాలోని వివిధ మండలాల ఉత్తమ ఉపాధ్యాయులకు గురుపూజోత్సవ కార్యక్రమంలో భాగంగా సన్మానించారు.ఈ సందర్బంగా కుల్కచర్ల మండలం నుండి శ్రీమతి కె.రజిని(ఎస్జిటి రాంనగర్),కుల్కచర్ల కస్తూరి భా గాంధీ విద్యాలయం శ్రీమతి భాగ్యమ్మ (ఎస్ఎ.సోషల్), ముజాహిద్ పూర్ ఆదర్శ పాఠశాల ఉపాధ్యాయుడు శ్రీనివాస్ గౌడ్(పిజిటి. ఇంగ్లీష్),జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పుట్టాపహాడ్ శ్రీమతి మంజుల(ఎస్ఎ.ఇంగ్లీష్) లను ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, తాపస్ రాష్ట్ర అధ్యక్షుడు రాజశేఖర్,ప్రధాన కార్యదర్శి పెంటయ్య జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు కూర సంగమేశ్వర్,బసవరాజు ఆధ్వర్యంలో మెమెంటో,శాలువా ప్రశంసా పత్రంతో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు.ఈ సందర్బంగా ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ సమస్యల పట్ల నిరంతరం పోరాడుతూ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నట్లు తెలిపారు. దేశం కొరకు సైనికులు రైతులు,నూతన సమాజ నిర్మాణం కొరకు ఉపాధ్యాయులు పని చేస్తున్నారని తెలిపారు.ఈ కార్యక్రమంలో తాపస్ కుల్కచర్ల మండల అధ్యక్షుడు స్వయం ప్రకాష్,ప్రధానకార్యదర్శి రవి కుమార్,ఉపాధ్యాయులు బుచ్చిలింగం,సంతోష్,శ్రీనివాస్,చెన్నకేశవులు తదితరులు పాల్గొన్నారు.