schedule Monday, November 02, 2026

జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు పిఆర్టీయూ కుల్కచర్ల మండల శాఖ ఘన సత్కారం

calendar_today September 26, 2026
person Prajagalam News
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులకు పిఆర్టీయూ కుల్కచర్ల మండల శాఖ ఘన సత్కారం
    కుల్కచర్ల:-   వికారాబాద్ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన కుల్కచర్ల మండలానికి చెందిన ఉపాధ్యాయులను పిఆర్టీయూ కుల్కచర్ల మండల శాఖ తరపున ఘనంగా సన్మానించారు. కుల్కచర్ల మండల పిఆర్టీయూ అధ్యక్షుడు శ్యామ్ సుందర్ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల కుల్కచర్ల కావలి.శ్రీశైలం (ఎస్ఎ. తెలుగు),బాలికల ఉన్నత పాఠశాల భక్తవత్సల్ (ఎస్ఎ. హిందీ పండితుడు),జడ్పీహెచ్ఎస్ సాల్వీడ్ వి. తులసి నాయక్(ఎస్ఎ. మ్యాథ్స్), జడ్పీహెచ్ఎస్ ముజాహిద్ పూర్ కె. ఎల్లయ్య(ఎస్ఎ. బయోసైన్స్), జడ్పీహెచ్ఎస్ పుట్టపహాడ్ ఆంజనేయులు (ఫిజికల్ సైన్స్ ) లను శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో పిఆర్టీయూ నాయకులు బస్వరాజు,రాఘవేందర్ రెడ్డి,పెంటయ్య,తుప్పలి. ఆనంద్,డి. వెంకటయ్య,నీరటి.శేఖర్ తదితరులు ఉన్నారు