schedule Thursday, September 03, 2026

కుల్కచర్ల తైబజార్‌ వేలంపాట 12లక్షల ఒక వెయ్యి రూపాయలు

calendar_today March 26, 2026
person Prajagalam News
వికారాబాద్ (కుల్కచర్ల) కుల్కచర్ల మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో గురువారం గ్రామ సర్పంచ్ వార్వళ్ళ అంజిలయ్య,పంచాయతీ కార్యదర్శి భాస్కర్ గౌడ్ ఆధ్వర్యంలో తైబజర్‌ వేలంపాట నిర్వహించారు.వేలంపాటలో గ్రామానికి చెందిన పర్సపురం వెంకట్రాములు 12లక్షల ఒక వెయ్యి రూపాయలకు వేలం పాట పాడి తైబజర్‌ను దక్కించుకున్నారు. వేలం పాట డబ్బులను గ్రామపంచాయతీ నిబంధనాలకు లోబడి చెల్లించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ విజయ్ కుమార్,వార్డు సభ్యులు కడుమూరి రాంరెడ్డి,వినోద్ కుమార్, ఉత్తర కుమారి, గ్రామస్తులు గాదె మహిపాల్,నీరటి కర్ణయ్య, రామస్వామి, తదితరులు పాల్గొన్నారు.