schedule Thursday, September 03, 2026

హనుమాన్ దేవాలయానికి వంట పాత్రలు విరాళం

calendar_today March 26, 2026
person Prajagalam News
హనుమాన్ దేవాలయానికి వంట పాత్రలు విరాళం
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో హనుమాన్ దేవాలయం ఫంక్షన్ హాల్ కి తమ వంతుగా తండ్రి కీర్తి.శే. బాలకిషన్ జి తోతల జ్ఞాపకార్థం భార్య శాంతా భాయి కుమారులు ఓం ప్రకాష్ తోతల,గోపాల్ దాస్ తోతల, శ్యాంసుందర్ తోతల,రాజు తోతల ఒక లక్ష రూపాయల విలువజేసే వంట పాత్రలు (వంట బోగోనిలు, స్టవ్, టేబులు,మొదలగు సామానులు) దేవాలయానికి విరాళంగా అందజేశారు. విరాళం అందజేసిన వారికి శాశ్వత ధర్మకర్త యం.నారాయణ రావు మహరాజ్ మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు,యువకులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.