schedule Monday, November 02, 2026

జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు తులసినాయక్ కు ఘన సత్కారం .

calendar_today October 6, 2026
person Prajagalam News
జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయుడు తులసినాయక్ కు ఘన సత్కారం .
కుల్కచర్ల:-   కుల్కచర్ల మండలం సాల్వీడ్ గ్రామపంచాయతీలోని పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న ఉపాధ్యాయుడు తులసి నాయక్ జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకోవడం పాఠశాలకు, గ్రామానికి గర్వకారణమని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాంచందర్, ఉపాధ్యాయులు,గ్రామస్థులు పలువురు కొనియాడారు. జిల్లా స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు అందుకున్న మ్యాథ్స్ ఉపాధ్యాయులు తులసి నాయక్ ను మంగళవారం సాల్వీడ్ గ్రామంలోని జడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాంచందర్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు, విద్యార్థులు ఆయనను శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సాల్వేడ్ గ్రామ ఉపసర్పంచ్ సంధ్యారాణి ప్రభు, అమ్మ ఆదర్శ పాఠశాల చైర్మన్ సంతోష నరసింహులు, కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయుడు నర్సింహులు గౌడ్, చెల్లాపూర్ గ్రామ ప్రధానోపాధ్యాయుడు ఆనంద్, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు దేవుళ్ల నాయక్,తాపస్ మండల అధ్యక్షుడు స్వయం ప్రకాష్, గ్రామ మాజీ ఉపసర్పంచ్ హన్మంత్, డీలర్ లక్ష్మయ్య, వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.