schedule Monday, November 02, 2026

భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు

calendar_today October 7, 2026
person Prajagalam News

•  రెవిన్యూ డివిజనల్ అధికారి అనిత

(తాండూర్) దౌలాపూర్ రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్‌ 73లో ప్రతిపాదిత ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ స్కూల్‌ నిర్మాణం కోసం భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం అందేలా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి పంపిస్తామని తాండూర్ ఆర్‌డీఓ అనిత తెలిపారు.బుధవారం ప్రతిపాదిత పాఠశాల స్థలాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన ఆమె, బాధిత రైతులతో మాట్లాడారు. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని నష్టపరిహారం త్వరగా మంజూరయ్యేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో యాలాల తహసీల్దార్ గాయత్రి, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు యుబుగ్గప్ప, ఎంఆర్‌పీఎస్ నాయకుడు మహేందర్, రైతులు వెంకటయ్య, బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.