schedule Monday, November 02, 2026

కుల్కచర్లలో అమ్మవార్లను దర్శించుకున్న పరిగి ఎమ్మెల్యే సతీమణి టి.ఉమా రామ్మోహన్ రెడ్డి 

calendar_today October 12, 2026
person Prajagalam News
కుల్కచర్లలో అమ్మవార్లను దర్శించుకున్న పరిగి ఎమ్మెల్యే సతీమణి టి.ఉమా రామ్మోహన్ రెడ్డి 
  కుల్కచర్ల:-   వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ప్రతిష్టించిన శ్రీ దుర్గాభవాని అమ్మవారిని పరిగి ఎమ్మెల్యే,టీపీసీసీ ట్రైనింగ్ కమిటీ చైర్మన్ డాక్టర్ టి. రామ్మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి ఉమా రామ్మోహన్ రెడ్డి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.ఈ సందర్భంగా అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించి, రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు.కుల్కచర్ల మండల కేంద్రంలోని శ్రీ పోచమ్మ అమ్మవారి ఆలయాన్ని సందర్శించిన శ్రీమతి ఉమా రామ్మోహన్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.దేవీ నవరాత్రుల వేళ ఆలయాలకు వచ్చిన భక్తులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ,అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉండాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామ పెద్దలు,భక్తులు, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.